నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయన్నారు.ఆఫ్‌లైన్ టికెట్లు అమ్మడం లేదని.. ఆన్‌లైన్‌లో పేటీఎంలో మాత్రమే విక్రయిస్తామని అజహరుద్దీన్ తెలిపారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు నగరానికి వస్తుందని, 15న ప్రాక్టీసు ఉంటుందని వెల్లడించారు. భారత జట్టు 16న హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. 17న ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తాయని అజహరుద్దీన్ వివరించారు.