ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బుధవారం బోనకల్లు అడ్డ రోడ్డు వద్ద గల పాలడుగు గ్రామంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో డైవర్ మృతి చెందారు.