YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ సమన్వయ కమిటీ సభ్యులు గట్టు రామచందర్ రావు, కొండా రాఘవ రెడ్డి, పిట్ట రాంరెడ్డి, గడిపల్లి కవిత,నీలం రమేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణలో వైయస్ఆర్ ని ప్రేమించే గుండెలు లక్షలాదిగా ఉన్నాయి. వైయస్ఆర్ అభిమానులు అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామీణ స్థాయిలో కమిటీలను సైతం బలోపేతం చేస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ కి YSR తెలంగాణ పార్టీయే ప్రత్యామ్నాయం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.అని చెప్పారు. గట్టు రామచంద్ర రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులు YSRపథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ,ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. మన బలం వైయస్ఆర్ గారి పథకాలు. ప్రతి పార్టీలో వైయస్ఆర్ గారి అభిమానులున్నారు. అందరూ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిశీలకులు బండారు అంజన్ రాజు, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ విభాగం కోఆర్డినేటర్ తెట్టెబావి ఆనంద్ కుమార్, వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ ఉప్పరి ప్రసాద్ & శ్రీమతి సుధారాణి, Lb నగర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ మామిడి రామచందర్, రాజేంద్రనగర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ సొంతిరెడ్డి రాఘవ రెడ్డి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇటుకల సుగుణ రెడ్డి, రాష్ట్ర స్వయం సహాయక సంఘాల కోఆర్డినేటర్ అన్ను చైతన్య రెడ్డి, GHMC మహిళా కోఆర్డినేటర్ కల్పన గాయత్రి , కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ బి.శివ పావని తదితరులు పాల్గొన్నారు.