రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలను విజయవంతం చేయండి
– పార్టీ శ్రేణులకు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పిలుపు :
దేశంలో జరుగుతున్న మత విద్వేషాలు, హింసకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చేస్తున్న భారత్ జోడో యాత్రకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఏపీ సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతుగా “చేయి చేయి కలుపుదాం .. రాహుల్ గాంధీని బలపరుద్దాం” అనే నినాదంతో రాష్ట్రంలో 26 నుంచి పాదయాత్రలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక కృష్ణ నగర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గం ఇన్చార్జులు బోడ వెంకట్, బాలేపల్లి మురళీధర్ తో కలిసి ఆమె చర్చించారు. గ్రామ, మండల, వార్డు, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో జరిగే పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణ పై ఆమె పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అరాచక, నిరంకుశ పాలన సాగుతుందని ద్వజమెత్తారు. పెరిగిన నిత్యవసరాలు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు ఆర్థికంగా కుదేల వుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమయాత్తం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ ప్రాణాలకు సైతం తెగించి దేశాన్ని కాపాడేందుకు ముందుకు నడుస్తున్నారని, ఆయన మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగేది కాంగ్రెస్ పార్టీతో మాత్రమేనని, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజలు బలపరచడం ద్వారా మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమహేంద్రవరం రూరల్ ఇన్చార్జి బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నాయకత్వంలో 26వ తేదీ నుంచి జరిగే పాదయాత్రను విజయవంతం చేయటానికి కృషి చేస్తామన్నారు. ఏపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి సుంకర పద్మశ్రీ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమయత్వం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అనంతరం ఆమెను పలువురు కాంగ్రెస్ నాయకులు దుస్సాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగారావు, ముళ్ళ మాధవ్, పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, పార్టీ నాయకులు చామర్తి లీలావతి, కొవ్వూరు శ్రీనివాస్, బత్తిన చంద్రరావు, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బాలాజీ శర్మ, జక్కంపూడి సత్తిబాబు, ఆయిల శేషగిరి, ఆలీ, రాజు తదితరులు పాల్గొన్నారు.