- వ్యక్తీకరణ స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను హరించి వేసే జీవో నెం1 తక్షణమే రద్దు చేయాలి.
జీవో రద్దు కొరకే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ ఉద్యమాలు చేపడతామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవో నెం 1 దగ్ధం చేసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన జీవో నెం1 రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా, కాకినాడలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ బాల భవన్ వద్ద నిరసన ధర్నా జరిగింది. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నెంబర్ వన్ జీవో వల్ల భావవ్యక్తీకరణస్వేచ్చను, నిరసన తెలియజేసే స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను పూర్తిగా నిషేధిస్తూ నియంత్రత్వ పొగడలకు బాటలు వేస్తూ నల్ల జీవో తీసుకురావడం జరిగిందని, ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజలకు తీవ్రతర నష్టం వాటిల్లుతుందని, ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజా గొంతుకుల, హక్కులను హరించి వేసే విధంగా దురుద్దేశంతో ఈ జీవోను తీసుకొచ్చారని, బ్రిటిష్ కాలం నాటి తెల్ల దొరల పరిపాలనలో పోలీస్ జాతీయ కమిషన్ 1861 లో ప్రవేశపెట్టిన పోలీస్ చట్టం తీసుకొచ్చిందని, ఆనాటి చట్టాన్ని ప్రజా ఉద్యమాలు అణిచివేసే ధోరణి కొరకు తీసుకొచ్చిందని, మన ప్రభుత్వం కాలం చెల్లిన పోలీస్ చట్టం ఆధారంగా జీవోలను తీసుకొచ్చే ప్రజా హక్కులు హరించడానికి నియంతత్వ విధానాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రసాద్ మండిపడ్డారు. జీవో నెంబర్ వన్ తక్షణమే రద్దు చేయకపోతే ఉద్యోగ ,ఉపాధ్యాయ ,కార్మిక సంఘాల, ప్రజా ల ఆధ్వర్యంలో ఐక్య కార్యచరణ ఉద్యమాలు చేపడతామని ప్రసాద్ అన్నారు. నిరసన అనంతరం జీవోలు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ (పిఎస్) ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కామిరెడ్డి బోడకొండ, బొబ్బిలి ఈశ్వరరావు, ప్రసాద్, చిన్న బాబు, బంగారు రాజేష్, వడ్డాది శ్రీనివాస్, కౌలు శీను, సింగంపల్లి రమణ, పి ఎల్ రాజు, ఆర్టీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.