తీర ప్రాంత మత్స్యకారుల గొంతుక పార్లమెంట్లో వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ ఎంపీ గురుమూర్తిని కలిసిన వాకాడు మండల తీర ప్రాంత మత్స్యకారులు తిరుపతి జిల్లా వాకాడు మండలానికి చెందిన పలువురు మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తిని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఎన్నో సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన పులికాట్ ముఖద్వారం పూడికతీత గూర్చి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లిన తిరుపతి ఎంపీ గురుమూర్తిని దుశ్శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేసారు.అలాగే తమిళనాడు మత్స్యకారులు పెద్ద బోట్లతో మా ప్రాంతాలలో చేపలు పడుతూ అడ్డుకున్న ఆంధ్ర మత్స్యకారులపై దాడులు చేస్తూ మా వలలని నాశనం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ చర్యల వలన మా జీవన గమనం అగమ్యగోచరంగా మారిందని విన్నవించారు. తుఫాను షెల్టరు, త్రాగు నీటి సౌకర్యం, రోడ్లు వివిధ సమస్యల గూర్చి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకు రాగా సావధానంగా విన్న ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించారు.