- ఫిబ్రవరి 26 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు – ఏపి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు.
- ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
- థియరీ పరీక్షలు గతంలో ప్రకటించిన విధంగానే జరుగుతాయని స్షష్టం చేసింది.
- జనరల్ కోర్సుల విద్యార్ధులకు ఫిబ్రవరి 26నుంచి మార్చి 7వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేర్కొంది.
- వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 20నుంచి మార్చి 7వ తేదీ వరకు (16రోజులు) నిర్వహించనున్నారు. (ఆదివారాలతో సహా) ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్స్‌లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
- ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది.