తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు.క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది.