- ప్రధాని వస్తున్నారని ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్..
మధ్య ప్రదేశ్ ఇండోర్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికారులు చేసిన పనిపై విమర్శలు వస్తున్నాయి.ఆ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఆ రాష్ట్ర సీఎంతో పాటు రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా లాంటి 70 మంది వ్యాపార అధిపతులు రానున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన డివైడర్లపై గడ్డి ఎండిపోవడంతో అధికారులు గ్రీన్ కలర్ పిచికారీ చేయించారు.