నందిగామ పట్టణం నందు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య , రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి కార్పొరేషన్ నిధులను వారు గొప్పగా చెప్పుకునే నవరత్నాలకు తరలించడాన్ని గౌరవ హై కోర్ట్ వారు నిలదీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వెయ్యడాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ..
- వైసీపీ పార్టీ దళితులపై కపట ప్రేమలు కురిపించి ఎస్సీ లను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసారు.
- కార్పొరేషన్ కు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని 2003లోనే గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవ మర్యాదలు లేకుండా బేఖాతరు చేయడం ఏమిటి?
- నామమాత్రమైన కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చేసి వారు పని చేయడానికి వీలులేకుండా ఎటువంటి నిధులు లేని కార్పొరేషన్ పదవులను ఇచ్చి సీటుకే పరిమితం చేసి కీలుబొమ్మలను చేసి బడుగు,బలహీన,దళిత వర్గాలను అధికార వైసీపీ పార్టీ కీలు బొమ్మలను చేసి ఆడుకుంటుంది.
- 7000 కోట్ల రూపాయలను వారి నవరత్నాల పేరిట పప్పు బెల్లాల పంచి వాటిని పన్నుల రూపంలో తిరిగి వసూలు చేస్తూ సామాన్య మానవుడి నడ్డి విరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
- ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదన్న హైకోర్టు
ఢాబుగా బడుగు,బలహీన,దళిత వర్గాల ప్రభుత్వామని గొప్పలు చెప్పుకునే వైసిపి పార్టీ దళితులకు చేసింది ఏమీ లేదు. బడుగు బలహీన దళిత వర్గాలకు పచ్చడి మెతుకులు విసిరి. వారు మాత్రం బహుళ అంతస్తుల భవనాలలో ప్యాలస్ లలో పంచపక్ష పరమాన్నాలు భుజిస్తున్నారు.గత తెలుగు దేశ ప్రభుత్వం హయాంలో బడుగు,బలహీన, దళిత వర్గాల వారికి సబ్సిడీలతో ఎన్నో వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.ఎన్ ఎస్ ఎఫ్ డి సి పథకం కింద ఎంతోమంది దళితులకు ఇన్నోవా కార్లు, ఎతియోస్ వాహనాలు, ఆటోలు ఇలా అనేక రకాల పథకాలను వాళ్ళకి అందజేయడం జరిగింది.
దళితులు సైతం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతోమంది దళిత యువతీ,యువకులను విదేశీ విద్యా దీవెన కింద విదేశాలకు పంపించడం జరిగినది. అలానే భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పబడే ఖరీదైన సివిల్స్ సర్వీసెస్ కు దళిత విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచిత శిక్షణలు ఇప్పించడం జరిగింది. దళితులకు సైతం సాగు చేసుకోవడానికి ప్రభుత్వం ద్వారా భూములను కొనుగోలు చేసి దళితులకే వ్యవసాయ భూములను అప్పజెప్పిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుంది.తెలుగుదేశం పార్టీ దళితుల,బడుగు,బలహీన వర్గాల పక్షాన నిలబడి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి విలక్షణ నటన పోషించి బడుగు, బలహీన,దళిత వర్గాల పార్టీ వైసీపీ పార్టీ అని దొంగ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని తన కల్లబొల్లి మాటలతో మోసం చేశాడు.వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క సబ్సిడీ లోను ఇచ్చిన పాపాన పోలేదు.పైగా రాష్ట్రమంతటా దళితులపై దాడులు.
మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిగా చిత్రీకరించి ఆయన మరణానికి కారణమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం.దళితులపై అక్రమ దాడులు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, దళితులకు శిరోముండనాలు చేసిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుంది.సదరు దళితులపైనే సెక్షన్ త్రీ కేసులు పెట్టించిన తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.కొంచమైనా సిగ్గుండాలి. బడుగు,బలహీన,దళిత వర్గాల ప్రభుత్వమాని చెప్పుకొని తిరిగే మీరు ప్రజాక్షేత్రంలోకి ఒకసారి రండి ప్రజలే చెబుతారు మీకు తగిన బుద్ధి. త్వరలోనే వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజానీకం భూస్థాపితం చేయనున్నారని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తెలియజేసారు.