తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాలను భక్తుల కోరిక మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించడం జరిగిందని టిటిఢి ఒక ప్రకటన విడుదల చేసింది . అయితే, కొన్ని పత్రికల్లో పేర్కొన్నట్టు గదుల అద్దె భారీగా పెంచేశారనడం వాస్తవం దూరం. ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను టిటిడి నిర్ణయించింది. అప్పటినుంచి అదే అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే, పలువురు భక్తులు ఏసీతోపాటు అధునాతన సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు అందించిన మేరకు టిటిడి ఈ విశ్రాంతి గృహాల్లోని గదులను ఆధునీకరించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించడం జరిగింది. అయితే, సదరు పత్రికల్లో పేర్కొన్నట్లు గదుల అద్దెను భారీగా టిటిడి పెంచిందనడం వాస్తవం కాదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేయడమైనది.