సినిమాకు రాజకీయానికి విడదీయలేని బంధం వుంది. సినిమా అంటే రాజకీయం రాజకీయాలతో సినిమాలు….
తమకు కిట్టని హీరోల సినిమాలు రిలీజ్ ప్రీ రిలీజ్ ల కు ఇబ్బందులు కలుగ చెయాయటం లో ఏ పి సర్కార్ ఒక ఎప్పుడు ఉత్సహలం గానే ఉంటుంది.. అదే పంధాలో బాలకృష్ణ హీరో గా నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేనిపోని చికాకులు కల్పించింది. తర్వాత అనుమతులు మంజూరు చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో డైలాగులు పొలిటికల్ ట్విస్ట్ ఉంది. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో..కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు అంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కు కౌంటర్ గా ఈ సినిమాలో డైలాగు ఫాన్స్ ను ఆకట్టుకుంది.
నాది ఫ్యాక్షన్ కాదు ..సీమ మీద ఏఫక్షన్….. పది నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లి నిలబడు అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగులు హైలైట్ గా ఉన్నాయి.మరి ఈ పొలిటికల్ డైలాగులపై అధికార వైసీపీ ఎలా స్పందిస్తోందో చూడాలి.