గ్రామాల సమస్యలు తీర్చడంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చక్కటి వేదికగా నిలుస్తుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్)అన్నారు. ఈరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండవల్లి మండలం లోకుమూడి గ్రామ సచివాలయంలో ఆయన 130 రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా మండల పరిషత్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి గడపగడపను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్ని ప్రత్యక్షంగా కలవడం.. వారికి అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకోవడం.. గ్రామ సమస్యలను గుర్తించడం…వాటికి పరిష్కార మార్గాలను వెతకడం… ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందని, ఇటువంటి ప్రజాపయోగ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు.
పేద మధ్యతరగతి సంక్షేమం కోసం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి వివక్షత లేకుండా.. అవినీతి రహితంగా.. అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.ముఖ్యమంత్రి జగనన్నను పది కాలాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా ప్రజలు దీవించవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే డిఎన్ఆర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అగస్తి ఆది విష్ణు, నాయకులు ముంగర మల్లికార్జునరావు, గ్రామ సర్పంచ్ కరేటి నాగమణి,చావలిపాడు సర్పంచ్ తలారి ధనలక్ష్మి, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు బేతపూడి ఏసోబు రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ జంపన కొండరాజు, ముంగర గోపాలకృష్ణ,బలే నాగరాజు,మండవల్లి పిఎసిఎస్ అధ్యక్షులు బొమ్మన బోయిన గోకర్ణ యాదవ్,మాజీ ఏఎంసీ చైర్మన్ తలారి వెంకటస్వామి, మండల కో ఆప్షన్ సభ్యులు దత్తాడ నరసింహారావు,పెరుమాళ్ల లక్ష్మీకాంతం, ఎస్ చంద్ర రావు, గ్రామ పార్టీ కార్యదర్శి రంగారావు, మత్తే పాపారావు, ముంగర ఏడుకొండలు, వాసుపల్లి విక్టర్ బాబు, దారా రమేష్, కొల్లా సాయి, తలారి అన్ని బాబు,కరేటి శివకృష్ణ, తలారి సత్తిబాబు, తలారి సత్యనారాయణ, బుర్ల శ్యామలరావు, కాటం సౌలు రాజు, ముసునూరి శ్రీను, మొగనాటి ఆనంద్, బోడావుల తిరుపతిరాజు, ఘంటసాల కృపారావు, జాజుల రాజు,గంగుల అశోక్, మునగాల రమేష్, ఎస్సై రామకృష్ణ ,మండల పరిషత్ ఏవో జూపూడి శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా ఏఈ కృష్ణారావు, ఎలక్ట్రికల్ ఏఈ రామకృష్ణ,ఏపీఎం ఎడ్వర్డ్,ఐసిడిఎస్ సూపర్వైజర్ కల్పవల్లి, వెలుగు సిసి మైనంపూడి మాధ వి, వివోఏలు సక్కుబాయి, కుసుమకుమారి, ఆదిలక్ష్మి,వీఆర్వో సుబ్రహ్మణ్యం,హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లలిత,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ,జాన్సీరాణి, ఆర్వీ రమణ, గ్రామ సచివాలయ సహాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.