ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కేసీఆర్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా పొంగులేటి సెక్యూరిటిని ప్రభుత్వం తగ్గించింది. అయితే అనేక సందర్భాలలో సొంత పార్టీ పైనే అసంతృప్తి వెళ్లగక్కిన నేపథ్యంలో అదిస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ నేతగా ఉన్నానని చెప్పుకుంటున్న మాజీ ఎంపీ పొంగులేటి సెక్యూరిటిని తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం. 2019 లో సెక్యూరిటి పై రివ్యూ చేసిన కేసీఆర్, నిఘా వర్గాల నివేధిక ఆధారంగా శ్రీనివాస రెడ్డి కి భద్రతను పెంచారు. 3+3 సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ ని ఇచ్చారు. పైలట్ వాహనాలలో మరో 6 పోలీసు కుడా ఉంటారు. దీనికి తోడుగా ఖమ్మం లోని క్యాంప్ ఆఫీసు లో కూడా ఐదుగురు సిబ్బంది… ఇలా మొత్తంగా 17 మందితో నిరంతరం పొంగులేటికి సెక్యూరిటి ఉండేది. గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పొంగులేటికి ఎలాంటి పదవి లేకపోయిన కూడా ఈ భద్రత కొనసాగింది.
అయితే ఒక్కసారిగా పొంగులేటి భద్రతను కేసీఆర్ ప్రభుత్వం తగ్గించేసింది. కేవలం 2+2 సెక్యూరిటిని మాత్రమే ఉంచారు. అలాగే ఇంటివద్ద ఉన్న పోలీసు ఔట్ పోస్ట్ కూడా పూర్తిగా తొలిగించారు. ఒక్కసారిగా ప్రభత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయి అనేది స్పస్టం అవుతుంది.
ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తన అనుచర వర్గం ఎన్నికల్లో పోటీ చేసి తీరుతుందని స్పస్టం చేశారు. అయితే బిఆర్ఎస్ లో మాత్రం ఆయనకు కానీ ఆయన అనుచర వర్గానికి కానీ పదవులు ఇచ్చే అవకాశాలు లేవు. దీనితో శ్రీనివాస రెడ్డి పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది ఇలా ఉంటే.. మంత్రి అజయ్ వర్గం పై పొంగులేటి వర్గీయులు సోషల్ మీడియా లో విరుచుకుపడ్డారు. పొగులేటి పార్టీ కి మాత్రం ఉపయోగపడడం లేదని.. కానీ పార్టీ వల్లే వచ్చే గన్ మెన్ లను ఉపయోగించు కుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో హంగామా చేస్తూ… వ్యక్తిగత ప్రయోజనలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏది ఏమైనా రెండున్నర యేళ్ళ తరువాత పొంగులేటి సెక్యూరిటిని తగ్గించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు పొంగులేటి ఏవిధంగా స్పందిస్తారో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.