రోడ్ల పై బహిరంగ సభల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మిగిలిన రాజకీయ పార్టీలు బహిరంగ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి కూడా. కానీ, మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఏమాత్రం తప్పు లేదని అభిప్రాయపడ్డారు. రోడ్ల పైన బహిరంగంగా సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ముందస్తుగా సభలకు, రోడ్ షో లకు అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వటంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలకు, సభకు హాజరైన వాళ్ళకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు చేయటం అధికారుల బాధ్యతన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేక దృక్పధంతో చూడాల్సిన అవసరం లేదని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు .