బ్రిటీష్ వారి పరిపాలనలో, భారతీయుల స్వతంత్ర సభలను అడ్డుకునేందుకు, సెక్షన్ 31/3 క్రింద బహిరంగ సభలను అడ్డుకుని స్వతంత్ర పొరాటంను నిర్వీర్యం చేసేందుకు చేసిన చట్టం. అదే చట్టాన్ని జగన్ ఆధ్వర్యంలో ఏపి ప్రభుత్వం తిరిగి జీవో నెం. MS1 రూపేణ తీసుకువచ్చారని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.
జగన్ ప్రభుత్వం బ్రిటీష్ వారకి ఏమాత్రమూ తీసిపోదని ఆయన తెలిపారు. తమ అధ్యక్షులు మాజి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే పోలీసులకు తెలియపరిచారని, కాని వారు స్పందించనా తీరు చాలా భాధాకరంగా ఉందని వారు వాపోయారు.