కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 8 న ఆయన కర్నూలు,పుట్టపర్తిలో పర్యటించనున్నారు. జనవరి 8 వ తారీఖు ఉదయం 11:15 కర్నూల్ లో అమిత్ షా బహిరంగ సభ పాల్గొంటారు. అనంతరం ఆయన మధ్యాహ్నం 1:30 గంటలకి పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యి బావిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు 3 గంటలకి పార్టీ పుట్టపర్తిలో బహిరంగ సమావేశం పోల్గొంటారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని సంధర్శిస్తారు. అనంతరం అమిత్ షా పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారు.