ఆదివారం చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రా ప్రమోషన్లో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనపై, అలాగే పవన్ కల్యాణ్ వ్యతిగత విషయాలపై చేసే విమర్శలు సరైనవి కాదని, అవి వింటున్నప్పుడు బాధ అనిపిస్తోందని అన్నారు. కొన్ని విమర్శలు విని తాను తట్టుకోలేకపోతున్నన్నారు. విమర్శలకు హద్దు లేకుండా పోయిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ కి ఆస్తులపై ఆసక్తి లేదన్నారు. తమ్ముడు పవన్ నిశ్వార్ధపరుడు. గత ఏడాది వరకు కూడా సొంత ఇల్లు కూడా లేదు. ప్రజలకు సేవ చేయెలనే తపనతోనే రాజకీయాలను ఎంచుకున్నాడు. అటువంటి పవన్ పై చేస్తున్న విమర్శలు విని ఒక్కోసారి తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు.
చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ బహిరంగంగా మాట్లాడింది లేదు. అటువంటిది ఎలక్షన్లు దగ్గిర పడుతున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిక్రంగా మారాయి. ఎన్నికలు దగ్గర చేసి ఆయన కూడా తన మద్దతుని తెలుపుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి…