Contents
ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా..
చెప్పుకోవాలంటే దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా స్టేట్ బ్యాంక్ కస్టమర్లుగా ఉన్నారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ప్రైవేటు బ్యాంకులకు ఏమాత్రం తక్కువ కాకుండా కస్టమర్ సేవలను అందిస్తోంది. పైగా ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల యుగంలో ప్రైవేటు కంపెనీలకు ఏమాత్రం తక్కువ కాకుండా వేగవంతమైన సేవలను అందిస్తోంది. దీనికి తోడు ఇటీవలి త్రైమాసికాల్లో అధిక లాభాలను నమోదు చేయటంతో పాటు.. మెుండి బకాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
వేగంగా వృద్ధి చెందుతూ..
ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ తన వ్యాపార విస్తరణను సైతం వేగంగా సాగిస్తోంది. కంపెనీ భవిష్యత్తు సైతం బలంగా ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ నుంచి ప్రతి నెల మంచి ఆదాయాన్ని పొందొచ్చని మీకు తెలుసా..? దీని వల్ల మీరు ఇంటి వద్ద ఉంటూనే ప్రతినెల మంచి ఆదాయాన్ని పొందొచ్చని తెలుసా..?
ఆదాయం ఇలా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 28000కి పైగా బ్యాంకు శాఖలను కలిగి ఉంది. దీని కోసం బ్యాంక్ ఏర్పాటుకు స్థలాన్ని లీజుకు లేదా అద్దెకు తీసుకుంటుంది. వాణిజ్య ప్రాంతాల ఆధారంగా శాఖలను మార్చుతుంటుంది. ఇందుకోసం టెండర్ల ద్వారా స్థలాన్ని బ్యాంక్ ఎంపిక చేస్తుంటుంది. కొన్నిసార్లు బ్యాంక్ మేనేజ్‌మెంట్ స్థలం లేదా భవనం కోసం అడుగుతుంది. అలా బ్యాంకుతో ఒప్పందం చేసుకోవటం ద్వారా అద్దె రూపంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ఆదాయం ఎంతంటే..
ఇలా బ్యాంక్ పెద్ద నగరాల్లో నెలకు రూ.20,000 నుంచి రూ.6 లక్షల వరకు అద్దె చెల్లిస్తూ ఉంటుంది. స్థలం లేదా భవనం ఉన్న ప్రాంతం, సౌకర్యాల ఆధారంగా ఈ రేట్లు మారుతుంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000 నుంచి గరిష్ఠంగా రూ.40,000 వరకు అద్దె రూపంలో బ్యాంక్ తన శాఖను ఏర్పాటు చేసిన భవవ లేదా స్థల యజమానులకు చెల్లిస్తుంది. ఇందుకోసం కనీసం 5 నుంచి 15 సంవత్సరాల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంటుంది. తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంటుంది.
ప్రాథమిక అవసరాలు..
SBI వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని లీజు నోటీసుల ప్రకారం.. SBI కొన్ని ప్రాథమిక సౌకర్యాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తుంది. బ్యాంక్ లీజుకు తీసుకునే ఆస్తికి తగిన పార్కింగ్ స్థలం, గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్, 24 గంటల నీటి సౌకర్యం, జనరేటర్ పవర్ బ్యాక్-అప్, విద్యుత్ కనెక్షన్, స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి తోడు సదరు స్థలంలో 10 అడుగుల కంటే ఎక్కువ ముందుభాగం ఉండాలి.
వెబ్ చిరునామా..
మీరు కూడా SBIకి మీ భవనాన్ని అద్దెకు ఇవ్వవచ్చు. అయితే దీనికోసం మీ ప్రాంతంలో ఎలాంటి టెండర్ అందుబాటులో ఉందనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈ వివరాలు తెలుసుకోవటం కోసం బ్యాంక్ సైట్ లోని.. https://sbi.co.in/web/sbi-in-the-news/procurement-news లింక్ ను చెక్ చేయాల్సి ఉంటుంది.