జ్ఞాన యోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి సోమవారం కన్ను మూశారు. పాండిత్య ప్రసంగాలతో ఆయన ఎంతో ఖ్యాతి గడించారు. ఆయనకు 81 యేళ్ళు. గత కొంత కాలంగా ఆయన వృద్ద్యాప సంబంధిత వ్యాదులతో బాధపడుతున్నారు. ఆశ్రమం లోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు విజయపుర డిప్యూటీ కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. ఆయన భక్తులు కర్నాటకలోని జ్ఞానయోగా ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి నివాళులర్పిస్తున్నారు.
సిద్దేశ్వర స్వామి అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనలతో నిర్వహించాలని నిర్ఞయించినట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా విజయపుర జిల్లాలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, కళాశాల లకు, పాఠశాల లకు సెలవు ప్రకటించింది.
సిద్దేశ్వర స్వామి సమాజనికి చేసిన సేవలు మరవలేనివని, ఆయన మరణం సమాజనికి తీరని లోటని ప్రధాని మోడి తన ట్విటర్లో ట్వీట్ చేశారు.