రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నీషేదిస్తూ జీవో జారీ చేసింది. భారీ బహిరంగ సభలకు హజరై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. అటువంటి సంఘటనలు అరికట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
- రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్లకు నిబంధన వర్తింపు.
- ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశం.
- రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక.
- ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు.
- అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి.
- షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు.
- టీవలి రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోంశాఖ ఉత్తర్వులు.