తెలుగు దేశం హయాంలో 54 లక్షల మందికి పెన్షన్‌లు ఇవ్వలేదని సీఎం జగన్ రెడ్డి నిరూపిస్తే మా పార్టీ ని రద్దు చేస్తామని, తన సవాల్‌కు ఆయన సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే జగన్ అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్ దారులను తొలగించారని చెప్పారు. సీఎం జగన్ కు ‘The Great Lier’ అని అవార్డ్ ఇవ్వాలని ప్రజలు ఘట్టిగా భావిస్తున్నారన్నారు. ఎలెక్షన్ ముందు పెన్షన్ పెంచుతామని మాట ఇచ్చి…మాట తప్పడం వల్ల ఇప్పటి వరకు ఒక్కో పెన్షన్ దారుడు రూ. 33 వేలు నష్ట పోయారన్నారు.
జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వమని.. సలహాదారులకు ఇచ్చే జీతాలు కూడా ఉపయోగం లేనివని.. వాటిని పెన్షన్ దారులకు ఇస్తే ఉపయోగమని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భాగోతం త్వరలో బయటపెడతామన్నారు తెలిపారు గోరింట్ల. చిత్తశుద్ది ఉంటే అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే.. ముందుగా జగన్ ఆర్ధిక నేరాలపై దర్యాప్తు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో జగన్ సర్కార్ పై మండిపడ్డారు.