భారీ అంచనాల నడుమ మెగాస్టార్ చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి పేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. కేథరిన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మాస్ మహా రాజా రవి తేజ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే రవి తేజ కు జోడీగా కేథరిన్ నటిస్తుందనే వార్తలు కూడా సామాజిక మాధ్యమంలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. అయితే దీనికి గాను ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఒక్క ఫోటోకానీ వీడియో గాని కూడా ఎక్కడా ప్రచరించిన సందర్భాలు లేవు.
అయితే ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ అనుమానాలకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి కూడా ముందుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిటించింది. కానీ చిత్రా యూనిట్ ఏదో కారణాలు చెప్పి ఆమె పాత్రను పూర్తిగా తొలిగించారు.
అయితే వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజ రవి తేజ నిడివి పెరగడంతో కేథరిన్ పాత్రను తొలిగించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి….