- జగనన్న ఇల్లు నిర్మాణం కి రూ 5 లక్షల ఇవ్వండి.
- పెన్షన్లు ఏరివేత ఆపండి.
- డ్రైనేజీ సమస్య పరిష్కరించండి.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల మూడున రాజమండ్రి వస్తున్న సందర్భంగా రాజమండ్రి నగరంలో నెలకొన్న ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని ప్రజా సమస్యలపై ఈ నెల నాలుగున జరగనున్న సిపిఐ జిల్లా జనరల్ బాడీని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు .
సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ ముఖ్య మంత్రి పర్యటన వల్ల రాజమండ్రికి ప్రయోజనం జరగాలని కోరుకుంటున్నామని, చిన్నపాటి వర్షానికి రాజమండ్రి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, మురికి నీరు ఇళ్లల్లోకి వస్తుందని మధు తెలిపారు.
రాజమండ్రి కాంప్లెక్స్ శ్యామల సెంటర్ దేవిచౌక్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉందని, దీన్ని పరిష్కారం చేయాలన్నారు. పెన్షన్లు చాలామంది తొలగించారని వాటికి కూడా పెన్షన్ మంజూరు చేయాలన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ద్విచక్ర వాహనాల దొంగలు ఎక్కువగా ఉన్నారని వీరికి కొంతమంది రాజకీయ నాయకులు అండగా ఉన్నారని, దీనిపై సీరియస్ గా తీసుకుని వీటిని అరికట్టాలన్నారు. జగనన్న ఇల్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చేలా రాజమండ్రి వేదిక ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుంద్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆచంట సత్యనారాయణ ఆకుల రామకృష్ణ, అబ్బూరి రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.