గుర్తు తెలియని దుండగులు కొందరు మహాసేన రాజేష్ పై దాడికి దిగారు. ఆయన కారుపై రాళ్ళు, బీరు సీసాలు విసిరారు. పత్తిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామానికి చెందిన మహాసేన రాజేష్ జనసేన రాజమండ్రి నగర జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైయ్యారు. రాజమండ్రి లోని కంబాల చెరువు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కంబాల చెరువు వద్ద ఆయన కారుని అప్పి కారుపై రాళ్ళు విసిరి, బీరు సీసాలతో దాడి చేశారు.
ఇది అధికార పార్టీ నాయకులు పనే అని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. నగరంలోని వై జంక్షన్ వద్ద శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకకు రాత్రి 9:30 సమయంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాజేష్ వస్తారని తెలిసిన కొందరు దుండగులు నందం గనిరాజు కూడలిలో కాపు కాసి వాహనాన్ని అడ్డుకుని దాడికి దిగారు.
జన సైనికుడు రాజేష్ మద్దతుపై నిలదీశారు ఇదంతా చూస్తున్న జనసేన నాయకులు కారు వద్దకు చేరుకున్నారు రాజేష్ ను వెనక్కి పంపే ప్రయత్నం చేస్తుండగా దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. అయిన వాహనంపై బీరు సీసాలు రాళ్లు విసిరారు కొందరు కారు అద్దాలు పగలగొట్టారు.
జరిగిన సంఘటనపై మహాసేన రాజేష్ స్పందిస్తూ జనసేనకు మద్దతిచ్చినప్పుడే ప్రాణాలకు తెగించి నన్ను చంపిన తర్వాత అయినా నా జాతి ఈ వైకాపా అక్రమలను అర్థం చేసుకుంటే చాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజే నా ప్రాణాలకు తెగించానని, మా పై ఎన్ని దాడులు చేసినా మాలోని ధైర్యాన్ని చంపలేరు అని స్పష్టం చేశారు ఆయన.
మిత్రుడు రాజేష్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించడంతో రాజేష్ పై దాడిని ఖండిస్తుమన్నారు ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్…ఏపూరి సూర్యారావు (శ్రీను). ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి… దళితులపైనే దళితులుతో దాడి చేయడం దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ విధానం కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలని కోరుతున్నాని ఏపూరి సూర్యారావు విజ్ఞప్తి చేశారు.