రానున్న రెండు మూడు నెలల్లో విశాఖ రాజధానిగా రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే త్వరలోనే భోగాపురం విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారిని బొత్స దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందన్నారు. అది ప్రభుత్వ విధానం అన్నారు.
నూతన సంవత్సరాన్ని పురష్కారించుకుని మంత్రి విజయనగరం జిల్లాలోని పైడి తల్లి అమ్మవారిని ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.