రెండు ఛాపర్లు ఆకాశంలో ఢీకొన్న సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో ఊహించని ఈ ఘోర ప్రమాదం ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ హెలీకాప్టర్ పాక్షికంగా దెబ్బతినగా, మరోకటి పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే ఆస్ట్రేలియా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.