For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Updated: Wednesday, November 23, 2022, 9:17 [IST]
EPFO News: ఈ రోజుల్లో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారటం వృత్తిలో భాగంగా మారింది. అయితే మారిన ప్రతిసారీ పీఎఫ్ ఖాతాలో డబ్బు అలాగే ఉండిపోతుంది. అందుకే ఉద్యోగం మారిన తర్వాత మునుపటి కంపెనీ పీఎఫ్ సొమ్మును కొత్త కంపెనీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎఫ్ సొమ్ము బదిలీ.. EPFO కార్యాలయానికి వెళ్లకుండానే మీ PFని బదిలీ చేసుకోవటం ఎలాగో దశల వారీగా చూద్దాం. పీఎఫ్ హోల్డర్లు తమ డబ్బును బదిలీ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఇందుకు అనుమతిస్తుంది. ఇంటి వద్ద నుంచే సులువుగా దీనిని పూర్తి చేయవచ్చు. కానీ దీనికి కొన్ని పత్రాలు అవసరం. PFని బదిలీ చేయడానికి ముందుగా UAN నంబర్ తో పాటు దాని పాస్‌వర్డ్ అవసరం. ఇందుకోసం మీ మెుబైల్ నంబర్ ఖాతాతో అనుసంధానించి ఉండాలి. పైగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ తప్పక కలగి ఉండాలి.
PF బదిలీ ఇలా.. 1. PF బదిలీ చేయడానికి EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కి లాగిన్ కావాలి. 2. అక్కడ’ఆన్‌లైన్ సర్వీసెస్’కి వెళ్లి, వన్ మెంబర్ – వన్ ఈపీఎఫ్‌పై క్లిక్ చేయాలి. 3. అక్కడ అవసరమైన సమాచారాన్ని పూరించాలి. ప్రస్తుత అపాయింట్‌మెంట్, PF ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పూరించాలి. 4. వివరాలు పూరించిన తర్వాత.. గెట్ డిటెయిల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మీ మునుపటి PF ఖాతా వివరాలు కనిపిస్తాయి. 5. దీని తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ ఫారమ్‌ను ధృవీకరించడానికి, యజమానిని ఎంచుకుని, ఆథరైజ్డ్ సిగ్నేటరీ హోల్డింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. 6. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP తర్వాత మీ మెంబర్ ID లేదా UAN నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 7. చివరగా.. మీ PF బదిలీ అభ్యర్థన ఫారమ్‌ను స్వయంగా ధృవీకరించాలి. అది మీ మునుపటి కంపెనీ PF బదిలీ గురించి సమాచారాన్ని పొందుతుంది. అలా మీ మునుపటి కంపెనీ ఈ బదిలీ అభ్యర్థనను ఆమోదించగానే పాత PF డబ్బు.. కొత్త PF ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
English summary
KNow howto shift PF amount from old company to new one in online
KNow howto shift PF amount from old company to new one in online