ఎండోమెంట్ పాలసీ..
ప్రతి పాలసీకి వేరువేరు ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడే పాలసీని ఎంచుకోవటంలోనే అసలైన విజయం ఉంటుంది. ఈ విషయంలో ఎల్ఐసీ ఏజెంట్ల మాటల కంటే.. ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. తాజాగా ఎల్ఐసీ తెచ్చిన న్యూ ఎండోమెంట్ పాలసీ రోజుకు కేవలం రూ.72 పొదుపుతో రూ.48 లక్షల ప్రయోజనాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ కొనుగోలు అర్హతలు..
ఈ పాలసీని 8 ఏళ్ల వయస్సు కలిగిన వారి నుంచి 55 ఏళ్ల వయస్సు వారివరకు కొనుగోలు చేసేందుకు అర్హులు. ఎవరైనా తమ ఉద్యోగ కెరియర్ ప్రారంభించిన సమయంలో దీనిని కొనుగోలు చేస్తే.. మంచి రాబడులను పొందవచ్చు.
మెచ్యూరిటీ వివరాలు..
పాలసీ మెచ్యూరిటీ సమయం 12-35 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసేవారు తమ అవసరాలకు అనుగుణంగా టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వారి రిటైర్ మెంట్ ప్లానింగ్, ఇతర అవసరాల ప్రకారం కాలాన్ని ఎంచుకునే వెసులుబాటు ఇందులో ఉంది
రూ.48 లక్షలు పొందండి..
ఎవరైనా వ్యక్తి 35 ఏళ్ల కాల వ్యవధితో రూ.10 లక్షలకు ఎండోమెంట్ పాలసీని తీసుకున్నట్లయితే అతను రూ.48 లక్షలు పొందవచ్చు. ఈ కాలంలో అతను ఏడాదికి రూ.26,500 ప్రీమియం రూపంలో చెల్లిస్తారు. అంటే ఇది రోజుకు సగటున రూ.72 పెట్టుబడిగా పెడుతున్నట్లు. మెుత్తం రూ.48 లక్షల్లో.. రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ మెుత్తం, బోనస్ రూ.15 లక్షలు మిగిలిన రూ.23 లక్షలు FAB సొమ్ము ఉంటుంది. ఈ కాలంలో పాలసీదారులు దాదాపు రూ.8.7 లక్షలు ప్రీమియం రూపంలో చెల్లిస్తారు.