రోజువారీ పనుల కోసం..
ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేక ఆన్‌లైన్ సేవలను పొందటానికి ఆధార్ అథెంటికేషన్ అవసరమవుతోంది. డిజిటల్ బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలన్నా ఆధార్ మెుబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండటం తప్పనిసరి. చాలా కంపెనీలు ఉద్యోగులను నియమించుకునేటప్పుడు వారి వివరాలను ఆధార్ తో పోల్చిచూస్తున్నాయి. అలా ఆన్‌లైన్ KYC ఇంటివద్ద నుంచే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
UIDAI..
ఒకవేళ ఆధార్ కార్డ్‌లో మారిన మెుబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలనుకుంటున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే UIDAI కార్డ్ హోల్డర్లకు ఈ విషయంలో సులువుగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది.
ఆధార్ కార్డ్‌లోని ఫోన్ నంబర్ అప్‌డేట్ చేసే ప్రక్రియ..
Step 1: ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్ సైట్ లేదా దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సంప్రదించి అపాయింట్ మెంట్ తీసుకోవాలి
Step 2: అపాయింట్ మెంట్ రోజున ఆధార్ కేంద్రంలోని అధికారిని సంప్రదించాలి
Step 3: అక్కడి అధికారికి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారమ్ ను పూర్తి చేసి అందించాలి
Step 4: ఆధార్ ఏజెంట్ మీరు అందించిన వివరాలను బయోమెట్రిక్ సమాచారంతో సరిపోల్చి చూస్తారు
Step 5: మీ అభ్యర్థన మేరకు మెుబైల్ నంబర్ అప్ డేట్ చేసి కొత్త నంబర్ లింక్ చేస్తారు
Step 6: ఇందుకుగాను సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది
Step 7: మార్పు ప్రక్రియ పూర్తైనట్లు ఆధార్ కేంద్రంలోని ఏజెంట్ అక్నాలెజ్డ్ మెంట్ స్లిప్ అందింస్తారు. అందులోని URN నంబర్ ద్వారా ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని ట్రాక్ చేసుకోవచ్చు.
ఒకసారి మీ ఫోన్ నంబర్ అప్ డేట్ అయిన తర్వాత ఆన్‌లైన్ లో UIDAI అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లించటం ద్వారా పీవీసీ ఆధార్ కార్డును కూడా పొందవచ్చు.