news Telugu News

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దీయోధర్

wczmSpe__400x400-15d8faa2

తిరుమల: ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దీయోధర్ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధనత్రయోదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. కరోనా నుంచి త్వరగతిన ప్రజలకు విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు.

 

టీటీడీ ఎస్వీబీసీ ఛానల్‌లో అసాంఘిక ఘటనలు జరగడం బాధాకరమని సునీల్ దీయోధర్ అన్నారు. అయోధ్య భూమి పూజను కూడా ఎస్వీబీసీ ప్రసారం చేయలేదని విమర్శించారు. తప్పులు చేయడం.. తర్వాత క్షమాపణలు చెప్పి సరిద్దిదుకోవడం టీటీడీకి సర్వసాధారణంగా మారిందన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆస్తులు, నిధులను ప్రభుత్వం కాపాడాలని సునీల్ దీయోధర్ అన్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment