news Telugu News

భారత నావికాదళానికి చెందిన ఐదో స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్ వాగిర్‌ జలప్రవేశం చేసింది.

Screenshot 2020-11-12 at 10.25.56 PM-990a71e8

ముంబై

 

దక్షిణ ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌లో వాగిర్‌ జలాంతర్గామిని లాంఛనంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ సతీమణి విజయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్‌మెరైన్‌ను సముద్రంలోకి ప్రవేశపెట్టారు.

ఈ జలాంతర్గాములకు ఫ్రెంచ్ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్​ఎస్​ రూపకల్పన చేయగా భారత నావికాదళ ప్రాజెక్ట్-75లో భాగంగా రూపొందిస్తున్నారు.

వాగిర్ సబ్‌మెరైన్‌ను ఇతర దేశాల క్షిపణులు, సబ్‌మెరైన్‌లు కనిపెట్టలేని స్టెల్త్ సామర్థ్యంతో రూపొందించారు. దీనితో పాటు అధునాతన శబ్దశోషణ సాంకేతికతను ఏర్పాటు చేశారు.

ఈ జలాంతర్గాములు యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, కీలక సమాచార సేకరణ, తీరప్రాంత గస్తీ తదితర కార్యకలాపాల్లో ఉపయోగపడతాయి.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment