news Telugu News

అర్ణబ్ గోస్వామి: ‘సుప్రీంకోర్టులో ఆయనకు ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు?’

sptdat48_arnab-goswami-released-from-jail-pti_650x400_12_November_20-12f219eb

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి బెయిల్ అభ్యర్థనను వెంటనే విచారణకు స్వీకరించడంపై సీనియర్ అడ్వొకేట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అసోసియేషన్ అధ్యక్షుడు దుశ్యంత్ దవే నిరసన…..

ఈ విషయంపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆయన ఓ లేఖ రాశారు.
”సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ లేఖ రాస్తున్నాను. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం అర్ణబ్ కేసును విచారణకు స్వీకరించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాను” అని దవే పేర్కొన్నారు.
”అర్ణబ్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలూ లేవు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసే హక్కులను అడ్డుకోవాలని నేను భావిచడం లేదు. అందరి పౌరుల్లానే ఆయన కూడా న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు.
”అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొన్ని ఎంపిక చేసిన అభ్యర్థనలనే విచారణ కోసం పరిగణలోకి తీసుకోవడం తీవ్రమైన అంశం. వేల మంది జైళ్లలో గడుపుతున్నారు. తమ పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని వారాలు, నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. అర్ణబ్ కేసు మాత్రం ప్రతిసారి అభ్యర్థన వచ్చిన వెంటనే పరిగణలోకి తీసుకుంటున్నారు” అని దవే ప్రస్తావించారు.
”ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాస్టర్ ఆఫ్ ద రోస్టర్‌ నుంచి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? ఎందుకంటే అలాంటి ఆదేశాలు లేకుండా ఇలా వెంటవెంటనే విచారణకు తీసుకోరు కదా.. లేకపోతే అర్ణబ్ కేసుకు రిజిస్ట్రార్ లేదా పరిపాలనా విభాగం అధిపతి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారా?” అని ప్రశ్నించారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment