news Telugu News

డీజీపీ మారి ఉంటే.. మాజీ సీఎం చంద్రబాబు అన్నారు

beef3d3c-b780-11e9-8687-f85b347b35b1_1568175327053_1574683726479-e748e7f3

అమరావతి: కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే.. అబ్దుల్ సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని విమర్శించారు. సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతోందన్నారు. జగన్ రాక్షసత్వం, అసమర్థకు కుటుంబాలు బలైపోతున్నాయని, వేధింపులకు గురిచేసి సలాం కుటుంబాన్ని బలితీసుకున్నారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

సలాం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే.. స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని చంద్రబాబు మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసే వరకూ..వాస్తవాలు బయటకు రాలేదన్నారు. తాను ట్వీట్ పెట్టాక పోలీసులు స్పందించారన్నారు. టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందంటూ ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందన్నారు. న్యాయవాదుల వల్ల బెయిల్‌లు వస్తాయా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారని నిలదీశారు. పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవర్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment