news Telugu News

_*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు

E53EEA98-6950-4D1C-8689-C53806ECF07F-0df61f45

*అమరావతి/శ్రీకాకుళం జిల్లా*

 

*రిమాండ్ రిపోర్టును అత్యంత బలహీనంగా తయారు చేసి బెయిల్ వచ్చేలా చేసి టిడిపి పై నిందలా?*

*- సలాం కుంటుంబ ఆత్మహత్యకు కారకులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు?*

*- అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యకి జగన్ రెడ్డి బాధ్యత వహించాలి.*

*- మైనారిటీలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సి.ఐ ను, హెడ్ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేయాలి.*

*- డీఎస్పీ ను సస్పెండ్ చేయాలి.*

*- వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి.*

*- ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ ముస్లిం కుటుంబానికి న్యాయం చేయాలి*

★ 12 గంటలు దాటకముందే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన పోలీసు అధికారులకు బెయిలు రావడం జగన్ ప్రభుత్వం వైఫల్యం.

★ సలాం పెట్టిన సెల్సీ వీడియోతో మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ చెల్లించిపోయారు.

★ కానీ వైసీపీకి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదు.

★ మైనారిటీలపై తమ నేరాలు-ఘోరాలు కప్పి పెట్టుకోవడానికి తప్పుడు విధానాలతో నిజాలను పాతర పెట్టి మైనారిటీలను మోసం చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారు.

★ మైనార్టీలపై ఎవరు కపట ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు.

★ మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది నువ్వు మీ తండ్రి 5 శాతం రిజర్వేషన్లు 4 శాతానికి పరిమితం చేసింది మీరు కాదా?

★ వృత్తిలో భాగంగా అడ్వకేట్స్ వివిధ రకాల కేసులను వాదిస్తూ ఉంటారు.

★ అంతమాత్రం చేత న్యాయవాదులకు, రాజకీయాలకు ముడిపెట్టి తమ ఘోరాలు, నేరాలు సాక్షి పత్రికలో రాయడం మైనారిటీలకు చేసే మరో అన్యాయం మాత్రమే.

★ ఎంఐఎం అధినేత ఓవైసీ గారికి అడ్వకేట్ గా బిజెపి నేత రఘునందన్ రావు పనిచేశారు.

★ కేసులకు పార్టీకి ఏం సంబంధం?

★ న్యాయవాద వృత్తికి, రాజకీయాలకు లింకు పెట్టడం నీచం.

★ టిడిపి న్యాయవాది వాదించడం వల్లే బెయిల్ వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడం దిగజారుడుతనానికి నిదర్శనం.

★ రామచంద్ర కాకపోతే మరొకరు వాదించే వాళ్ళు.

★ ప్రభుత్వం వైపు నుండి ఏం చేశారు?

★ రిమాండ్ రిపోర్టును అత్యంత బలహీనంగా తయారు చేసి సరైన వాదనలు వినిపించలేదు.

★ ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారం ఇవ్వలేదు.

★ మీరు చెబుతున్న రామచంద్రరావు వైకాపా నాయకుల కేసులు కూడా వాదించారు. దానికి ఏం సమాధానం చెబుతారు?

★ వృత్తికి రాజకీయాలకు ముడిపెట్టడం ముఖ్యమంత్రి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం.

★ మీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి మునాఫ్ కుటుంబాన్ని ఎలా వేధించారో ఈరోజు బట్టబయలైంది. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

★ రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్ ఆత్మహత్య ప్రయత్నానికి జగన్ ప్రభుత్వ వేదింపులు కారణం కాదా?

★ పిన్నెల్లి లో 100 ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

★ సెక్షన్ 302 కింద నంద్యాల లో పోలీసుల పై ప్రభుత్వం కేసు ఎందుకు నమోదు చేయలేదు?

★ రోజుకు 5 సార్లు నిష్టతో నమాజు చేసుకునే సలాం ను చేయని నేరానికి 42 రోజుల పాటు జైల్లో పెట్టి వేధించిన విషయం వాస్తవం కాదా?

★ అబ్దుల్ సలాంను వేధించడం వెనుక వైసీపీకి చెందిన శ్రీధర్ ప్రమేయం ఉన్న విషయం వాస్తవం కాదా?

★ పోలీసుల హింసలు తట్టుకోలేక పోలీసు స్టేషన్ లోనే రెండు సార్లు సలాం ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా?

★ కడపలో మైనారిటీ అంగన్వాడి టీచర్ పై వైకాపా నాయకులు దాడి చేయడమే కాకుండా స్కూలు తగలబెట్టడం పై ఏం సమాధానం చెబుతారు?

★ దుల్హన్ పథకం రద్దు, విదేశీ విద్యకు మంగళం పాడటంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

★ రంజాన్ తోఫా రద్దుకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

★ మీ మైనారిటీ విద్రోహాలను లాజిక్కులు, మ్యాజిక్కులు, కుట్రలు, కుతంత్రాలతో కప్పెట్టుకోవాలని చూడటం నీచం.

★ మైనారిటీలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సి.ఐ ను, హెడ్ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేయాలి.

★ డీఎస్పీ ను సస్పెండ్ చేయాలి. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి.

★ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ ముస్లిం కుటుంబానికి న్యాయం చేయాలి.

★ ఈ పనులు చేయకుండా నేరస్తుల్ని కాపాడడానికే వైకాపా నేతలు టిడిపి పై నిందలు వేస్తున్నారు.

★ నారా చంద్రబాబు నాయుడు గారు నాడు అబ్దుల్ కలాంను భారత రాష్ట్రపతి గా ప్రతిపాదిస్తే నేడు జగన్ రెడ్డి పాలనలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా చేసారంటే ఎవరు ముస్లిం పక్షపాతో తెలుస్తుంది.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment