news Telugu News

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరప్‌ రాయ్‌ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి #వైఎస్‌_జగన్‌మోహన్‌రెడ్డి తో భేటి అయ్యింది.

19EF8B85-E208-4391-9AAB-FEF4C3D87FC8-6ad4454b

తాడేపల్లి: క్యాంపు కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరప్‌ రాయ్‌ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి #వైఎస్‌_జగన్‌మోహన్‌రెడ్డి తో భేటి అయ్యింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో సీఎస్‌ నీలంసాహ్ని, హోంమంత్రి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి #కురసాల_కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంట తీవ్రతను కేంద్ర బృందానికి సీఎం వివరించారు. భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం సీఎం వైఎస్‌ జగన్‌తో భేటి అయ్యారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వారు చూసిన అనుభవాలను వారి సీఎం వివరించారన్నారు. జులై నుంచి వర్షాలు ఎక్కువగా కురవడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రధానంగా వరి, వేరు శనగతో పాటు అనేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. రోడ్లు అక్వా చెరువులు సైతం దెబ్బతిన్నాయని, కావునా కేంద్రం నుంచి సహాయం అందించాలని బృందాన్ని ఆయన కోరినట్లు తెలిపారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment