news Telugu News

కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు మానుకోవాలి : సిఐటియు మండల కార్యదర్శి ఎస్ భగత్

B997F9E5-0208-4EED-8F08-6C650E733779-e49b023c

దేవరపల్లి నవంబర్ 11: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు మానుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్ భగత్ అన్నారు. బుధవారం దేవరపల్లి లోనే రైతు సంఘం నాయకులు ఉండవల్లి కృష్ణారావు ఇంటివద్ద సంఘం అధ్యక్షురాలు మల్లిపూడి వెంకటలక్ష్మి అధ్యక్షతన సిఐటియు మండల కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 26వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు బుక్ లెట్ ను విడుదల చేశారు. సమావేశాన్ని ముందుగా ఇటీవల మరణించిన యర్రా మల్లికార్జునరావు, జి విజయలక్ష్మి లకు సంతాపం తెలియజేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి కృష్ణారావు, అయిన పర్తి శ్రీనివాసరావు, టి లక్ష్మి, గేలం సత్యనారాయణ, గుంటూరు వరలక్ష్మి, డి. మాణిక్యం, కె.కుమారి,పి.భారతి, 

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment