news Telugu News

*09.11.2020* *అమరావతి* *ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం* *వీర జవాన్‌ ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌* *ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*

9DFFE545-37C0-4A87-A325-ECC87F3CA399-6b6af54f

జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదుల కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ఒక లేఖ రాసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ సహాయం స్వీకరించాలని కోరారు.

మరోవైపు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం లేఖను అందజేశారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో వీర మరణం పొందారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment