news Telugu News

పాదయాత్ర కార్యక్రమం– పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్

WhatsApp Image 2020-11-10 at 4.52.35 PM-6c63db5a

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్ రామ్ గారు ముఖ్య అతిథిగా మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారు పాల్గొనగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్న పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక 47,48 వార్డుల నందు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గుడాల ప్రసాద్ , గుడాల ఆదిలక్ష్మి పాల్గొనగా జనంలో నాడు జనం కోసం నేడు అనే నినాదంతో పాదయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్ గారు ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలపై స్పందించి తక్షణమే పరిష్కారం జరిగే విధంగా అధికారులకు ఆదేశించడం జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుకుల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవాని ప్రియ, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, నిరీక్షణ జేమ్స్, భీమన వెంకట రమణ గౌడ్, అందనాపల్లి సత్యనారాయణ, కొంచ సత్య, మార్గాని చంటి బాబు,రాము శర్మ, కుంచేశేఖర్, అజ్జరపు రమేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నరు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment