news Telugu News

తూర్పుగోదావరి జిల్లా – నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు.

WhatsApp Image 2020-11-10 at 1.32.17 PM-2505ee3e

తూర్పుగోదావరి జిల్లా

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు.

యుటియఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు డిఎ బకాయిలు, పిఆర్సీ అమలు, పెండింగ్ లో వున్న మార్చి, ఏప్రిల్ నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలమూరు మండలం చెముడులంక ఎస్టీ ఎస్ఎన్ఎం ప్రభుత్వ పాఠశాల వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దశలవారీ పోరాటంలో భాగంగా మంగళవారం ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు ఆలమూరు మండల యుటిఎఫ్ శాఖ అధ్యక్షుడు పివివిజిఎస్ఎన్ మూర్తి తెలిపారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment