news Telugu News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

WhatsApp Image 2020-11-10 at 5.32.52 PM-cf2747a2

పత్రికా ప్రకటన తిరుపతి, 2020 నవంబరు 10

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

————————————————-

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment