news Telugu News

టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పారు …బండి సంజయ్

maxresdefault-5-eeaf36e3
✌️ బిజెపిపై నమ్మకంతో, విశ్వాసంతో స్ఫూర్తిదాయక విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు BJP Telangana రాష్ట్రశాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.ఉప ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు,నాయకులను అనేక ఇబ్బందులకు గురిచేశారు.అయినప్పటికీ మంచి విజయాన్ని సాధించాం.కార్యకర్తల కృషి,శ్రమ ఫలితమే ఈ విజయం.
 
👉  అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసింది. కానీ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని కోట్ల నిధులిచ్చిందో ప్రజలకు వివరించాం.ఎవరు వాస్తవాలు చెప్పారు.. ఎవరు అబ్ధాలు చెప్పారో దుబ్బాక ప్రజలు గ్రహించి తీర్పునిచ్చారు.
 
👉 TRS Party అడ్డగోలుగా ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. దుబ్బాక అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జేబులో నింపుకున్న టీఆర్ఎస్ నాయకులు అదే డబ్బును దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజలకు పంచారు.
 
👉 Telangana CMO కి వ్యతిరేకంగా ప్రజల ఇచ్చిన తీర్పు ఇది. అవినీతి, అబద్ధాల పాలన, నిరంకుశ, నియంతృత్వ, నియంత, రజాకార్ల, గడీల పాలనకు దుబ్బాక ప్రజలు సమాధి కట్టారు.భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి.
 
👉 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి Kishan Reddy Gangapuram గారితో మాట్లాడి కేంద్ర సాయం అందించాలని కోరాం. హైదరాబాద్ లో వరదలు వస్తే.. పేదలు ముంపునకు గురై ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ కనీసం ప్రగతి భవన్ దాటలేదు. తెలంగాణలో రామరాజ్యస్థాపన బిజెపితోనే సాధ్యమని దుబ్బాక ప్రజలు నిరూపించారు.
 
👉 టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పారు.ఇకనైనా కేసీఆర్ అహంకారం వీడాలి. దుబ్బాక విజయం స్ఫుర్తిగా తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తాం. గోల్కొండ కోటమీద కాషాయ జెండా రెపరెపలాడే వరకు ఈ విజయం కొనసాగుతుంది.
 
👉 నిజాం సమాధి వద్ద మోకరిల్లినప్పుడే కేసీఆర్ నీచమైన చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలు గ్రహించారు. సర్దార్ పటేల్ పాదాల ముందు మేం మోకరిల్లేందుకు వెళ్తే, అమరవీరులను స్మరించుకునేందుక వెళ్తే దేశభక్తులమయిన మమ్మల్ని అడ్డుకున్నారు…..బండి సంజయ్

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment