news Telugu News

ఏం సాధించారని ఈ పాదయాత్ర సంబరాలు – ముత్యాల బాబ్జి

WhatsApp Image 2020-11-10 at 3.58.25 PM-e4651595

************
గడిచిన ఈ 17 నెలలు కాలంలో ఏం సాధించారని పాదయాత్ర సంబరాలు చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ జిల్లా కార్య నిర్వహక కార్యదర్శి ముత్యాల బాబ్జి ఆక్షేపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఒక్కరికైనా ఇంటి స్థలం ఇవ్వలేదని, యువతకు ఉపాధి కొరకు కార్పోరేషన్ ల ద్వారా ఋణం అందించారా అని ప్రశ్నించారు.
పంట నష్టాలుకు పరిహారం ఇచ్చారా ఇవ్వలేదని,ఒక్క రోడ్డు అయినా నిర్మించలేక పోయారని, కనీసం మరమ్మత్తులు కూడా చేయలేకపోయారని వాపోయారు.
ప్రమాద భాధితులకు భీమా లేకుండా చేశారని,సహకార సంఘాలు ద్వారా రైతులకు రుణాలు అందించ లేక పోయారని మీ కార్యకర్తలకు పదవులు అంటగట్టి సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.వృద్దులైన భార్య భర్తలకు పెన్షన్ లు ఇవ్వాలి కదా అని మాయ మాటలతో సానుభూతి ఒలకబోసిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని విస్మరించారని తెలిపారు.నియోజకవర్గంలో సామాన్యులు ఇసుక అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వైసిపి నాయకులు మాత్రం అక్రమంగా ఇసుక తరలించుకు పోయారని విమర్షించారు.
విచ్చలవిడిగా నాటు సారా. అక్రమ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని,భూములకు రక్షణ లేకుండా చేసేస్తున్నారని , అక్రమాలను,అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి వేదిస్తున్నారన్నారు. ఒక ప్రక్క అమాయకులను కోర్టులు చుట్టూ తిప్పుతూ పాదయాత్రలు సంబరాలు అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.ప్రజా ప్రయోజనాలును విస్మరించిన వైసీపీ నేతలుకు సంబరాలు చేసుకునే అర్హత లేదన్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment