news Telugu News

ఆరోగ్యశ్రీ కింద 2434 వైద్య ప్రక్రియలను 6 జిల్లాల్లో అమలు చేసే కార్యక్రమాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించిన సందర్బంగా ఆయా జిల్లాల నుంచి లబ్ధిదారుల స్పందన…

EmcdM11VkAIWZOT-d90cd24f

10.11.2020
తాడేపల్లి

“మీరు చల్లగా వుండాలి…”
రమాదేవి, చక్రాయిపేట మండలం, కడపజిల్లా:
“మీరు చల్లగా వుండాలి… ఎప్పటికీ మీరే సీఎంగా వుండాలి… చాలా బాగా చేస్తున్నారు… మీ దయవల్ల ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు గర్భసంచీలో గడ్డ వుందని వైద్యులు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం వెడితే నలబై నుంచి యాబై వేల రూపాయల వరకు ఆపరేషన్ ఖర్చు అవుతుందని చెప్పారు. అంత భరించే స్తోమత లేక కడప ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ వైద్యులు నాకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఉచితంగా పరీక్షలు చేసి, తరువాత ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ తరువాత ఆరోగ్య ఆసరా కింద ఆదుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా నా ఆపరేషన్ తరువాత ఎలా వుందని ఫోన్ చేసి కనుక్కున్నారు. చాలా సంతోషంగా వుంది.”

 

ఆరోగ్యమిత్రను కలిశాను.. ఉచితంగా చికిత్స పొందుతున్నాను
గోవిందరాజు, వాకలపూడి గ్రామం, కాకినాడ రూరల్ మండలం, తూర్పు గోదావరిజిల్లా:
” నేను దివ్యాంగుడిని. నడుస్తూ కింద పడిపోయాను. తుంటి ఎముక విరిగింది. వైద్యులకు చూపిస్తే ఆపరేషన్ చేయించాలని చెప్పాను. స్థానికంగా వున్న ఆరోగ్య మిత్రను కలిసాను. వైయస్‌ఆర్ ఆరోగ్య కింద ఉచితంగానే వైద్య పరీక్షలు, ఆపరేషన్లు చేయించుకోవచ్చని చెప్పారు. ఆరోగ్యమిత్ర నన్ను వైద్యుల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించారు. కొత్తగా అమలు చేస్తున్న వైద్య ప్రక్రియల కింద ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కింద చేస్తామని చెప్పారు.

ఆరోగ్య ఆసరా కింద లబ్ధిపొందాను
లక్ష్మీనారాయణ, గోరంట్ల గ్రామం, గుంటూరుజిల్లా:
”నేను మేషన్ పనిచేస్తుంటాను. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక పోతే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేందుకు ఆరోగ్య మిత్రను కలిశాను. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. ఒక్కోటి రూ.4750 రూపాయల విలువైన ఏడు కీమోలు ఉచితంగా చేశారు. తరువాత ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆరోగ్య ఆసరా కింద పదివేల రూపాయలు ఇచ్చారు.”

మీ పేరు చెప్పుకుని పెద్ద ఆసుపత్రులకు వెళ్ళగలుగుతున్నాం..
మీసాల కృష్ణ, కరకవలస గ్రామం, శ్రీకాకుళంజిల్లా:
”నాది మారుమూల గ్రామం. నా పాప వయస్సు నాలుగేళ్ళు. ఆడుతూ కింద పడిపోయింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరీక్ష చేయిస్తే, ఆపరేషన్ చేయాలి, నలబై నుంచి యాబై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. సీఎం శ్రీ వైయస్ జగన్ గారు మన జిల్లాకు కూడా ఎక్కువ చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద అమలు చేస్తున్నారని బయటివారు చెప్పడంతో పాప ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చాను. వెంటనే జాయిన్ చేసుకున్నారు. ఉచితంగా ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. మా లాంటి పేదలకు ఇటువంటి స్కీంలు పెట్టడం మా అదృష్టం. మేం ధైర్యంగా మీ పేరు చెప్పుకుని పెద్ద ఆసుపత్రులకు వెళ్ళగలుగుతున్నాం.”

ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు
హుస్సేన్ బీ, వెంకటాపురం మండలం, ఇస్తాంపేట, నెల్లూరుజిల్లా:
”నాకు అనారోగ్యంతో హాస్పటల్ కు వస్తే, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఉచితంగా పరీక్షలు చేసి తరువాత ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పారు. మేం పేదవాళ్ళం. నాకు భర్త లేడు. ప్రభుత్వం నుంచి వితంతు పెన్షన్ అందుతోంది. ప్రైవేటు ఆసుప్రతులకు వెళ్ళే స్తోమత లేదు. తరువాత ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలో అందరూ బాగా చూసుకున్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment