news Telugu News

*అర్హులైన మరో 9వేల చేనేతలకు “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” రెండో విడత పంపిణీ* *బుధవారం చేనేత, జౌళి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం*

DD898EB1-D1A1-4C4D-B2C3-1EF7F91FAD79-d1693ac5

పత్రికా ప్రకటన

తేదీ: 10-11-2020,
అమరావతి.

*ఉదయం 11గం.లకు హైదరాబాద్ లోని మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ‘వర్చువల్’గా..*

అమరావతి, నవంబర్, 10; ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ రెండో విడత అందని చేనేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అవకాశం ఇవ్వడంతో అర్హత సాధించిన నేతన్నలకు చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం రెండో విడత పంపిణీ జరగనుంది. హైదరాబాద్ లోని మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ఉదయం 11గం.లకు ఆయన ‘వర్చువల్’గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సొంత మగ్గం కలిగి దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ద్వారా రూ.24 వేల చొప్పున గతేడాది డిసెంబర్ 21న ముఖ్యమంత్రి, మంత్రి కలిసి అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తొలి విడత సాయాన్ని రూ.196 కోట్లు అందించారు. కరోనా నేపథ్యంలో నేతన్నల ఇబ్బందులను ముందే అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చేనేతలకు రెండో విడత ఆర్థిక సాయాన్ని 6 నెలల ముందుగానే అంటే జూన్ 20వ తేదీన పంపిణీ చేసి ఆదుకున్నారు. అయితే అర్హత ఉండి..వివిధ కారణాలతో రెండో జాబితాలో పేరు రాని వారికి ప్రభుత్వం నాడు మరో అవకాశమిచ్చింది. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోమని అదే రోజు ప్రకటించింది. సందేహాలుంటే 1902 అనే నంబర్‌కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చుననే వెసులుబాటూ కల్పించింది. దీంతో ఒక నెల గడువు రావడంతో సుమారు మరో 9వేల మందికి మరో అవకాశం దక్కింది. వారందరి అర్హతలు నిష్పక్షపాతంగా పరిశీలించిన అనంతరం వారికి కూడా ప్రభుత్వం రూ.21.31కోట్లు వెచ్చించి రెండో విడత సాయాన్ని అందిస్తోంది.

——————-

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment